FbTelugu

మంత్రి ఈటల కబ్జా నిజమే: మెదక్ జిల్లా కలెక్టర్

మెదక్: మసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో అసైన్డు, సీలింగ్ భూములను మంత్రి ఈటల రాజేందర్ భార్యకు చెందిన జమునా హేచరీస్ కబ్జా చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ తేల్చారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరీశ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అచ్చంపేట గ్రామంలోని సర్వే నెంబర్లు 77, 78, 79, 80, 81, 82, 130లో అసైన్డు, సీలింగ్ భూమి కబ్జాకు గురైందని సంయుక్త విచారణ బృందాలు నిర్థారించాయి. ఈ భూముల్లో జమునా హేచరీస్ షెడ్లు నిర్మాణం చేశారు. అటవీ చట్టాలను ఉల్లంఘించి చెట్లను నరికివేసి రోడ్డు నిర్మించారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండా భారీ షెడ్లను నిర్మాణం చేశారు. భూ మార్పిడి చేయకపోవడం మూలంగా రెవెన్యూ శాఖకు నష్టం కలిగించారు. నష్టాన్ని పూడ్చేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని జిల్లా కలెక్టర్ సిఫారసు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.