FbTelugu

వ్యాక్సిన్ ఉత్పత్తి వేగవంతానికి చర్యలు

న్యూఢిల్లీ దేశంలో కరోనా కేసులు తారాజువ్వ మాదిరి దూసుకుపోతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిద్రను కరవు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు రెండే మార్గాలు ఉన్నాయి.

ఒకటి వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడం, రెండోది హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాలు పటిష్టం చేయడం. ఈ రెంటిలో వ్యాక్సిన్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐసిఎంఆర్, భారత్ బయోటెక సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ఉత్పత్తి పెంచనున్నారు. ఇతర సంస్థల్లో కోవాగ్జిన్ ఉత్పత్తి పెంచేందుకు భారత్ బయోటెక్ అంగీకారం తెలిపింది. అయితే వీటి ఉత్పత్తికి బిఎస్ఎల్-3 స్థాయి ల్యాబ్ లు అవసరం ఉంది. ఆ ల్యాబ్ లు ఏర్పాటు చేయడం లేదా ఉన్నవాటికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. బిఎస్ఎల-3 ల్యాబ్ లు కలిగిన సంస్థల నుంచి త్వరలో కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించే అవకాశం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.