FbTelugu

చెట్టును ఢీకొట్టిన మ్యాక్సీ క్యాబ్

రాజమహేంద్రవరం: చింతూరు మండలం బొడ్డుగూడెం సమీపంలో మ్యాక్సీ క్యాబ్ అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు వెంటనే అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. తూఫాన్ వాహనం పాల్వంచ నుండి చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.