FbTelugu

ఆన్ లైన్ వ్యాక్సిన్ కు మస్తు స్పందన

న్యూఢిల్లీ: వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారి కోసం ఈరోజు ప్రారంభించిన ఆన్ లైన్ కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. ఉదయం 9 గంటలకు ప్రారంభించగా కేవలం నాలుగు గంటల వ్యవధిలో 10 లక్షల మంది నమోదు చేసుకున్నారు.

వ్యాక్సిన్ అపాయింట్ మెంట్ తీసుకోవాలని అనుకునేవారు www.cowin.gov.in లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా తమ పేరు నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ రెండు అందుబాటులో లేనట్లయితే సమీపంలోని కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే కోవిన్ యాప్ లో సామాన్య ప్రజలకు నమోదు చేసుకునేందుకు ఇంకా వెసులుబాటు కల్పించలేదు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రభుత్వ కేంద్రాలతో పాటు ప్రైవేటులోను వ్యాక్సిన్ ను అందుబాటులో పెట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.