FbTelugu

ఓటీటీ లో మాస్టర్ మువీ?

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో హీరో విజయ్ నటించిన మువీ మాస్టర్ అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా థియేటర్ లో కాదు ఓటీటీలో విడుదల అవుతుందంటూ నటి రాధిక చేసిన ట్వీట్ గుబులు పట్టిస్తున్నది.

థియేటర్లలో విడుదలైతే చూడాలని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో రాధిక బాంబు పేల్చారు. మాస్టర్ మువీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల అవుతుందా, న్యూస్ పేపర్ లో ఈ విషయం చదివాను అని రాధిక ట్వీట్ చేసింది. నేనైతే ఈ మువీని థియేటర్ లోనే చూడాలని అనుకుంటున్నాను, మరి మీరు? అంటూ ఆమె ట్వీట్ చేయడంతో అభిమానులు నిరుత్సాహనికి గురయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.