న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశంలో కొత్తగా నమోదౌతున్న కరోనా కేసుల సంఖ్య ఘననీయంగా తగ్గిపోయింది. దేశంలో నిన్న ఒక్క రోజే కొత్తగా 27,071 మంది కరోనా బారిన పడ్డారు.
అదే సమయంలో కరోనాతో 336 మంది మరణించగా.. 30,695 మంది కరోనా బారినుంచి కోలుకున్నారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98,84,100కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,43,355కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారిలో 93,88,159 మంది కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 3,52,586 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.