న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గతంతో పోల్చితే.. ప్రస్తుతం కొత్తగా నమోదౌతున్న కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దేశంలో నిన్న ఒక్క రోజే కొత్తగా.. 29,398 మంది కరోనా బారిన పడ్డారు.
అదే సమయంలో కరోనాతో 414 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. 37,528 మంది కోలుకున్నారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,96,770 కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,42,186 కి చేరింది. కరోనా బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 92,90,834 మంది కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 3,63,749 యాక్టీవ్ కేసులున్నాయి.