FbTelugu

భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకి తీవ్రంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చింతపల్లి మినుములూరులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

పాడేరు లో 8, అరకులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు తెలంగాణలోనూ అనేక ప్రాంతాల్లో 10 డిగ్రీలకు లోపే ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ముఖ్యంగా అదిలాబాద్, అసీఫాబాద్, ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.