FbTelugu

శ్రీశైలానికి భారీగా పెరుగుతున్న వరద

కర్నూల్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3.91 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది.

కాగా దిగువకు 73,770 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 880 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 190 టీఎంసీల నీరు ఉంది.

You might also like