FbTelugu

పెట్టుబడుల పేరుతో భారీ మోసం..

హైదరాబాద్: వ్యాపారంలో పెట్టుబడులు పెడతానని చెప్పి చెన్నుపాటి వేణుమాధవ్ అనే వ్యాపారి మోసం చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయ్యింది.

వేణు మాధవ్ రూ.10 కోట్ల పెట్టుబడుల పేరుతో గోల్డ్ షిప్ ఎబోడ్ సంస్థలో సీఈఓ గా చేరాడు. పెట్టుబడులు పెట్టకపోగా సంస్థ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని సంస్థ ఎం.డి చంద్రశేఖర్ ఫిర్యాదులో తెలిపాడు. నిధుల దుర్వినియోగం పై నిలదీయడంతో సిఈఓ ఉద్యోగానికి  రాజీనామా చేశాడు. సంస్థ ఇచ్సిన మెర్సిడైజ్ కారు తిరిగి ఇవ్వకుండా తిప్పుతున్నాడు. రూ. 2 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని  గోల్డ్ షిప్ ఎబోడ్ ఎం.డి చంద్రశేఖర్ తన ఫిర్యాదులో తెలిపారు. వేణుమాధవ్ మీద ఐపిసి 406, 409, 420 కింద కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.