FbTelugu

5 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం

కోల్ కతా: 5 అంతస్తుల భవనంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవదహనమైన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కోల్ కతాలోని ఓ 5 అంతస్తుల భవనంలో ప్రమాదవ శాత్తూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటల్లో చిక్కుకున్న ఓ 12 ఏళ్ల బాలుడు, మరో వృద్ధురాలు అగ్నికి ఆహుతైనారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి సహాయక చర్యలు ప్రారంభించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.