FbTelugu

మసీదులో భారీ పేలుడు

కాబూల్: మసీదులో భారీ పేలుడు సంభవించి నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కాబూల్ లోని ఓ మసీదులో ఇవాళ (శుక్రవారం) ప్రార్థనలు చేస్తూ ఉండగా..

ఒక్కసారిగా ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఇమామ్ సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.

You might also like