FbTelugu

దక్షిణ అమెరికాలో భారీ భూకంపం

నిన్న రాత్రి దక్షిణ చిలీ ప్రాంతంలో భారీ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కోరల్‌ నగరానికి 140 కి.మీ. దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం ఉన్నట్టుగా ఈఎంఎస్‌సీ (యూరోపియన్‌ మెడిటేరియన్‌ సీస్మోలాజికల్‌ సెంటర్‌) స్పష్టం చేసింది.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8 గా ఉన్నట్టు తెలిపింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు తెలిపింది. ఈ భూకంపంతో ప్రాణ, ఆస్థి నష్టం ఏమీ జరగలేదని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.