ఇవాళ ఉదయం దక్షిణ అమెరికా దేశమైన చిలీ తీరంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం అంటార్కిటికా తీరంలోని చిలియన్ బేస్ గా గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.0గా నమోదైనట్టు అక్కడి అధికారులు స్పష్టం చేశారు.
తీరంలో భూకంపం సంభవించడంతో సునామీ వచ్చే అవకాశం ఉన్నందున్న వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అలాగే తీరం వెంట ఉండే ప్రజలను, టూరిస్టులను సముద్ర తీర ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. చిలీ దేశపు అతిపెద్ద వాయుసేన స్థావరం సునామీ సంభవించే ప్రాంతంలోనే ఉండడం గమనార్హం.