FbTelugu

స్వల్ప వివాదం.. భారీ ఘర్షణ

కృష్ణా: గ్రామ వాలంటీర్ల మధ్య చోటుచేసుకున్న స్వల్ప వివాదం భారీ ఘర్షణకు దారితీసిన ఘటన జిల్లాలోని కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అరుంధతి కాలనీలో నిన్న రాత్రి బైక్ తగలడంతో గ్రామ వాలంటీర్ల మధ్యం స్వల్పవివాదం చోటుచేసుకుంది.

దీనిపై ఘర్షణ కు దిగిన ఇరు వర్గాల గ్రామ వాలంటీర్లు కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు ఇనప నూరి నాగరాజు, నరేష్ లు మరి కొందరితో కలిసి కర్రలతో రాత్రి సమయంలో దాడికి దిగారు.ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.