FbTelugu

బంగారం షాపు య‌జ‌మాని ఇంట్లో భారీ చోరీ

* ఇద్దరిని హతమార్చి 17 కేజీల బంగారం చోరీ
చెన్నై: ఓ బంగారం షాపు య‌జ‌మాని ఇంట్లో కొందరు దుండగులు ఇద్దరిని హతమార్చి, ఏకంగా 17 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన తమిళనాడులోని మైల‌దుతురాయిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మైల‌దుతురాయిలో ఓ బంగారం షాపు యజమాని నివాసం ఉంటున్నాడు.

నిన్న అతని ఇంట్లోకి ముగ్గురు దొంగలు మారణాయుధాలతో చొరబడి ఇంట్లో వారిని బెదిరించి, అడ్డుతగిలిన ఇద్దరిని హతమార్చి 17 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దొంగలు పారిపోతూ సీసీటీవీ కెమెరా హార్డ్ డిస్క్‌ను కూడా తీసుకెళ్లారు. ఈ ఘటనపై స‌మాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవదిలోనే దుండగులను పట్టుకున్నారు. వారిని 2 గన్నులు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.