FbTelugu

ఢీల్లీలో భారీ పేలుడు.. అప్రమత్తమైన ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం దగ్గర భారీ పేలుడు సంభవించింది. దీంతో అధికారులు అప్రమత్తమై హైఅలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

పేలుడు ధాటికి ఆ ప్రాంతంలోని అనేక కార్లు ధ్వంసమైనాయి. పేలుడుకు ఐఈడీ ఉపయోగించినట్టుగా అధికారులు నిర్థారించారు. బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి 1.4 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. అలాగే పేలుడు సంభవించిన ప్రాంతంలో అనుమానాస్పద వస్తువులు, బాల్ బేరింగ్స్, ఓ లేటర్ గుర్తించినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.