FbTelugu

ఈ నెల 6న మహాద్భుతం

ఈ నెల 6వ తేదీన (శనివారం) ఆకాశంలో మహాద్భుతం జరుగుతుందట. 102 అంతస్తుల బిల్డింగ్‌ కంటే ఎత్తైన భారీ గ్రహశకలం ఒకటి భూమికి అతి దగ్గరగా చేరుతుందట.

ఈ గ్రహశకలానికి రాక్‌ 163348(2002 ఎన్‌ఎస్‌4) అని పేరు పెట్టినట్టు నాసా తెలిపింది. ఇది సెకనుకు 5.2 కిటోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందట. దీని ఎత్తు గరిష్ఠంగా 1870 అడుగుల ఉండవచ్చని నాసా అధికారులు అంచనా వేశారు. శనివారం అది భూమికి దగ్గరగా వచ్చినా ఆదివారం నాటికి అది భూమికి మరింత చేరువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయట. ఆ రోజు దాని కదలికలు నమోదు చేయడంపై దృష్టి సారించామని నాసా వివరించింది.

అయితే, ఆకాశంలో అప్పుడప్పుడూ ఆవిష్కరించే ఇలాంటి అద్భుత విషయాలను మనం కూడా చూస్తే బాగుంటుంది కదా. కానీ, అది మనకు స్పష్టంగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఓ ప్రయత్నమైతే చేద్దాం. ఆదివారం అది భూమికి మరింత దగ్గరకు వచ్చే అవకాశముండడంతో ఆ రోజు దానిని చూసేందుకు అంతా సిద్ధంగా ఉందామా మరి.

You might also like