FbTelugu

పశ్చిమ బెంగాల్ కు భారీ సాయం

కోల్‌కతా: ఉంపన్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్ లో ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా తక్షణ సాయంగా బెంగాల్ కు రూ.1000 కోట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. తుఫాన్ ప్రభావం ఉన్న ఒడిషాలోనూ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ విపత్తు కారణంగా మృతి చెందిన వారికి రూ. రెండు లక్షల ఆర్థిక సాయం, గాయపడిన వారికి రూ50 వేల సాయం అందించనున్నట్టు తెలిపారు.

You might also like