FbTelugu

పుష్కర ఘాట్ల వద్ద యువతిపై సామూహిక అత్యాచారం

గుంటూరు: తాడేపల్లి మండలం పరిధిలోని సీతానగరం లో దారుణం జరిగింది. సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నది తీరంలో ఓ యువతి పై సామూహిక అత్యాచారం చేశారు.
శనివారం అర్ధరాత్రి సమయంలో ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కాళ్ళు, చేతులు కట్టేసి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

అత్యాచారం చేసిన తరువాత నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని వెల్లడించింది. బాధితురాలి ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే కొంతమంది స్థానిక యువకులను జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నట్లు సమాచారం. బాధితులు( ప్రేమజంట) శనివారం రాత్రి నది తీరంలో సేద తీరడానికి వచ్చినట్లు పోలీసులు కు తెలిపారు. ఇదే అదనుగా కొందరు బాధితురాలిని పక్కకు తీసుకువెళ్లి అత్యచారం చేయగా, ప్రేమికుడికి మరో చోటుకు తీసుకువెళ్లి భౌతికంగా హింసించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.