FbTelugu

మాస్ మహారాజ రవితేజ చిత్రం ‘రామారావు ఆన్‌డ్యూటీ’

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌డ్యూటీ’. రవితేజ 68వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతోనే ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా, స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

కాగా ఇందులో మజిలీ బ్యూటీ దివ్యాన్ష కౌశిక్‌, రజిషా విజయన్‌లు కథానాయికలు. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరపుకుంటోన్న ఈ మూవీ విడుదల తేదీని తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది 2022 మార్చి 25న చిత్రం విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ చిత్రంలో తనికేళభరణి, నాజర్‌, సీనియర్‌ నటుడు నరేశ్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా రాహుల్‌ రామకృష్ణ సర్పట్టా ఫేం జాన్‌ విజయ్‌, చైతన్య కృష్ణ తదితరులు నటిస్తున్నారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.