FbTelugu

ఇదేమి చోద్యం… 

కరోనా రక్కసి రెక్కలు చాస్తున్న వేళ దానిని  దరి చేరనీయకుండా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఓవైపు వైద్యులు మరోవైపు  కోరుతున్నప్పటికీ చాలామంది మాస్కులు, భౌతిక దూరం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు . కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిన మంత్రి, కలెక్టర్  సైతం ఆ నిబంధనను బహిరంగంగా ఉల్లంఘిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. బుధవారం నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలంలో జరిగిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, హరితహరం కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర అటవిశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖి తో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు భౌతిక దూరం నిబంధనను పూర్తిగా ఉల్లంఘించి గుంపులు గుంపులుగా కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది.ఒకరిని తాకుతూ మరొకరు దగ్గర దగ్గరగా నిల్చుని కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చకు తావిస్తోంది

నిబంధనలు పాటించాల్సిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆ నిబంధనలను ఉల్లంఘించి సామాన్యులకు ఎలాంటి సందేశం ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి .

You might also like

Leave A Reply

Your email address will not be published.