FbTelugu

ఆన్ లైన్ లో మాస్కులు… రూ.30 లక్షల మోసం

హైదరాబాద్: అబిడ్స్ కి చెందిన అశోక్ అగర్వాల్ యూరప్ దేశానికి చెందిన ఆగ్రో బయో కంపెనీ మోసం చేసింది. కంపెనీ చెప్పిన విధంగా రూ.60 లక్షల విలువ చేసే మాస్కులకు ఆర్డర్ చేశాడు.

కంపెనీ వారు చెప్పిన విధంగా ముందుగా రూ.30 లక్షలు అడ్వాన్స్ గా ఆన్ లైన్ ద్వారా పంపించాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెయిళ్లు పెట్టినా సదరు కంపెనీ స్పందించలేదు. ఎంతకూ మాస్కులు రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన అశోక్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like