FbTelugu

ఆ దేశంలో మాస్కులకు గుడ్ బై

జేరుసలేం: మాస్కులు ధరించకుండా ఎప్పటి మాదిరే తిరగవచ్చని ఇజ్రాయెల్ దేశం పౌరులకు స్వేచ్ఛను ఇచ్చింది. ఇవి లేకుండా ఎక్కడైనా సంచరించవచ్చిని ప్రకటించడంతో పౌరులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

కరోనా నియంత్రణ కోసం పాటించాల్సిన నిబంధనలు ఆదివారం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగి అల్లాడుతుంటే ఈ దేశంలో మాస్కులే వద్దని నిర్ణయం తీసుకోవడం ఏంటని అనుకుంటున్నారా!. దేశంలో సగం మందికి పైగా వ్యాక్సిన్లు తీసుకోవడంతో ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నది. విద్యాలయాలను పునఃప్రారంభించింది. కరోనా కారణంగా సెప్టెంబర్ నెలలో విద్యా సంస్థలను మూసివేశారు. దేశంలో ఒక్కడోసు వ్యాక్సిన్ తీసుకున్నవారు 60 శాతం మంది కాగా రెండు డోసులు వేయించుకున్నవారు 56 శాతం మంది ఉన్నారు. ఫైజర్, బయో ఎన్ టెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్లను ఇచ్చారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 16 సంవత్సరాల లోపు వారిని మినహాయించారు. మాస్కులు ప్రతి ఒక్కరు ధరించాలంటూ ఏప్రిల్ 2020లో ఆదేశాలు జారీ చేసింది. మాస్కులు అవసరం లేదంటూ ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయంపై పలు దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదొక వార్తగా మారింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో ప్రపంచానికి మేము మార్గదర్శకులం అయినట్లు ఇజ్రాయెల్ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.