FbTelugu

మాస్క్ ఎస్సై అరెస్టు

ప్రకాశం: మాస్క్ పెట్టుకోలేదంటూ యువకుడిపై దాడికి పాల్పడిన చీరాల టూ టౌన్ ఎస్సై విజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 18న మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే యువకుడిపై ఎస్సై దాడి చేసిన విషయం తెలిసిందే.

ఎస్సై దాడి ఘటనలో తలకు గాయం కావడంతో కిరణ్ కుమార్ మృతి చెందాడు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దళిత సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. దళిత సంఘాల నిరసనతో ఎస్సై విజయ్ కుమార్ ను ఎస్పీ సిద్దార్థ కౌశల్ సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశాలు జారీ చేశారు. యువకుడి మృతిపై గుంటూరు అడిషనల్ ఎస్పీ గంగాధర్ విచారణ చేసి జిల్లా ఎస్పీ కు నివేదిక అందచేశారు. నివేదిక ఆధారంగా ఆయనను ఇవాళ అరెస్టు చేశారు.

You might also like