FbTelugu

నో మాస్క్ ఫెనాల్టీలు రూ.30 కోట్లు

ముంబయి: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టకున్నా ప్రజలో దానిపై ఏమాత్రం భయం లేదు. ముంబయి మహానగరంలో మాస్క్ లెకుండా తిరుగుతున్న ప్రజల నుంచి రూ.30 కోట్లు అపరాధ రుసుం రూపేణా ముక్కు పిండి వసూలు చేశారు.
ఈ మొత్తాన్ని 15 లక్షల మంది నుంచి వసూలు చేయడం గమనార్హం. కరోనా మహమ్మారి ప్రారంభంలో ముంబయి మహానగరంలో విపరీతంగా కేసులు నమోదు అయ్యాయి. ఊహించని విధంగా కేసులు నమోదు కావడంతో ప్రజలు హడలిపోయారు. కట్టడి కోసం బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని ఆదేశాలు జారీ చేసింది.

గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈరోజు వరకు మాస్క్ ధరించని 15 లక్షల మంది నుంచి రూ.30 కోట్లు ఫెనాల్టీ రూపేణా వసూలు చేశారు. సోమవారం నాడు ఒక్కరోజే రూ.26 లక్షలు కట్టించుకున్నారు. లోకల్ రైళ్లు ప్రారంభం కావడంతో ప్రతినిత్యం 34 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరి ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండడంతో మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్నవారిపై కూడా ఫెనాల్టీలు వేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.