FbTelugu

ఇకపై ప్రజలకు మాస్క్ తప్పనిసరి

ముంబయి: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకి తీవ్రం అవుతున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ.. ఆర్డర్స్ జారీ చేశారు.

ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలెవరూ మాస్కులు లేకుండా బయట తిరగవద్దని హెచ్చిరించారు. ఒక వేళ అలా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వ్యాప్తి ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

You might also like