FbTelugu

పెళ్లి మండపాల్లో మార్షల్స్: కర్ణాటక మంత్రి సుధాకర్

బెంగళూరు: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ తిరగబెట్టింది. తక్కువ సంఖ్యలో నమోదయ్యే కేసులు వేలకు చేరుకోవడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి.

వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కర్ణాటక ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. పెళ్లి మండపాలు, విందులలో మార్షల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రజలు కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేందుకు వేదికల వద్ద మార్షల్స్ ఉండనున్నారు. వివాహాలు, శుభకార్యాల్లో ఐదు వందల మంది కి మించకుండా అనుమతించడం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ వెల్లడించారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కాలబుర్గి జిల్లాలో ప్రయాణ మార్గదర్శకాలు అమలుచేస్తున్నారని చెప్పారు. ఆ రాష్ట్రం నుంచి కర్ణాటకకు వచ్చే వారు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ టెస్టు రిపోర్టు చూపించాలని, నెగెటివ్ ఉంటేనే అనుమతిస్తున్నామని ఆయన తెలిపారు. కేరళ నుంచి వచ్చే వారి కోసం కూడా నిబంధనలు అమలు చేస్తామని, త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి సుధాకర్ వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.