FbTelugu

టిక్‌టాక్‌ లవ్… పెళ్లైతే వద్దు

Ticktack-Love-Dont-get-married

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాలకు బానిసలైపోయిన యువత ఎటు వెళుతున్నారో వారికే తెలియని పరిస్థితి నేడు సమాజంలో కన్పిస్తోంది. మరీ ముఖ్యంగా టిక్ టాక్ క్రైమ్ ఎక్కువైపోతోంది. ఇద్దరు యువతులు టిక్‌టాక్‌లో పరిచయమైన యువకులు పెళ్లి చేసుకుందాం రమ్మంటే వెళ్లి.. తీరా అక్కడికి వెళ్లాక చేసుకోము పొమ్మంటే నలుగురిలో అబాసుపాలైన ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరులో చోటుచేసుంది. వివరాల్లోకెళితే… టిక్‌టాక్‌లో పరిచయమైన ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుందాం రమ్మంటే ఇద్దరు యువతులు వెళ్లారు. తీరా అక్కడికెళ్లాక యువకులు చేసుకోమని తేల్చి చెప్పారు. దీంతో అమ్మాయిలు గ్రామంలోని పెద్దలను ఆశ్రయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

You might also like