FbTelugu

మొగుడిని మోసగించిన పెళ్లైన మహిళ

రూ.6 లక్షలతో ఉడాయింపు, ఆపై బెదిరింపులు
తిరుపతి: ఇప్పటి వరకు మగాళ్లు మహిళలను మోసం చేయడం చూస్తున్నాం. కాని గత కొద్ది నెలలుగా పెళ్లైన మహిళలు పెళ్లికాని వారిని మోసం చేస్తున్నారు. ఈ కొత్త ట్రెండులో పలువురు మగాళ్లు మోసపోతున్నారు.
తనను పెళ్లి చేసుకున్న ఒక మహిళ మోసం చేసిందని, రూ.6 లక్షలు తీసుకుని ఉడాయించిందని భర్త అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయపురం మండలం నారపురాజు కండ్రిగకు చెందిన సునీల్ (29) సత్యానారాణపురంలో ఉంటున్నాడు. ఏడిబి ఫైనాన్స్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఎం. సుహాసినితో ఏర్పిన పరిచయం ప్రేమగా మారింది. తనకు పెళ్లి కాలేదని, అనాథ అని చెప్పడంతో సునీల్ ఆమెను గత డిసెంబర్ నెలలో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన తరువాత ఇద్దరూ కొద్ది నెలలు కాపురం చేశారు. తనను ఆదరించిన వారికి డబ్బులు ఇవ్వాలంటూ సునీల్ నుంచి రూ.4 లక్షలు, అత్తా, మామల నుంచి మరో రూ.2 లక్షలు తీసుకున్నది.

అనుమానం వచ్చిన సునీల్ రూ.6 లక్షలు ఏం చేశావంటూ నిలదీయడంతో ఈ నెల 7వ తీద నుంచి ఇంటి నుంచి పరారీ అయి వెళ్లిపోయింది. ఆమె ఆధార్ కార్డు ఆధారంగా అలిపిరి పోలీసు స్టేషన్ లో భర్త ఫిర్యాదు చేశాడు. తన భార్య సుహాసిని కన్పంచడం లేదని పోలీసులకు తెలిపాడు. ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు విచారించగా అసలు గుట్టు బయటపడింది. నెల్లూరు జిల్లా రాజుపాళెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుతో ఆమెకు అప్పటికే వివాహ అయ్యింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. పోలీసుల విచారణ జరుగుతుండగానే రెండు రోజుల క్రితం భర్త సునీల్ కు సుహాసిని ఫోన్ చేసింది. త్వరలో డబ్బులు ఇస్తానని, తనపై కేసు ఉపసంహరించుకోవాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని ఫోన్ పెట్టేసింది. అలిపిరి పోలీసులు సుహాసిని కోసం గాలిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.