FbTelugu

భూతవైద్యానికి వివాహిత బలి

కరీంనగర్: భూతవైద్యానికి వివాహిత బలైన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రజిత అనే వివాహితకు దెయ్యం పట్టిందంటూ.. వారం రోజుల క్రితం అత్తవారింట్లో భూతవైద్యం పేరుతో శ్రీనివాస్ అనే వ్యక్తి విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైంది.

దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రజిత మృతి చెందింది. రజితకు రెండు నెలల పాప ఉంది. ఈ ఘటనకు కారకులైన భూతవైద్యుడు శ్రీనివాస్, మృతురాలి బాబాయి శ్యామ్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

You might also like