FbTelugu

ఇద్దరు పిల్లలతో వివాహిత ఆత్మహత్య!

విజయవాడ: తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ వివాహిత కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానిక బందరు కాల్వలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి బందరు కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.

కాగా ఆ ఇద్దరు పిల్లలు దూకకుండా తప్పించుకున్నారు. దీంతో ఆ వివాహిత మాత్రమే కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు పశ్చిమ గోదావరి జిల్లా మోర్తకు చెందిన స్వరూపారాణిగా పోలీసులు గుర్తించారు. అయితే యువతి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like