FbTelugu

వివాహిత ఆత్మహత్య.. భర్తపైనే అనుమానం!

నెల్లూరు: ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన జిల్లాలోని కావలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కావలికి చెందిన జ్యోతిక, రవి భార్యాభర్తలు.

జ్యోతిక ఇవాళ అనుమానాస్పదంగా బాత్ రూమ్ లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జ్యోతిక తల్లిదండ్రులు మాత్రం తమ కూతురి ఆత్మహత్యకు భర్త రవినే కారణమై ఉంటాడని ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.