FbTelugu

వైభవంగా పెళ్ళి..86 మందికి కరోనా

హైదరాబాద్: పెళ్లిళ్లు, విందులు, వినోదాలు అతి తక్కువ మందితో నిర్వహించుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నా జనం మాట వినకుండా ఆర్భాటాలకు పోతున్నారు.
ఫలితంగా తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతూ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నది. అటు ప్రభుత్వాన్ని, ఇటు వైద్యులను ఠారెత్తిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో కరోనా కలకలం రేగింది. ఆ గ్రామంలో ఇటీవలే ఒక వివాహం వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి కట్టుబాట్లు పాటించకుండా వందలాది మంది హాజరయ్యారు.

శానిటైజర్లు లేవు, భౌతిక దూరం పాటించలేదు. దీంతో వివాహానికి హాజరైన వారిలో కొందరికి లక్షణాలు కన్పించడంతో పరీక్షలు చేసుకోగా ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న మిగతా 370 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇందులో 86 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
పెళ్లికి హాజరైన వారందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిద్దాపూర్ లో ఆరోగ్యశాఖాధికారులు క్యాంప్ ను ఏర్పాటు చేశారు. తాజాగా తెలంగాణలో 1321 కరోనా కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.