FbTelugu

ప్రేమ వివాహం.. మర్మాంగాలు కోసి భర్తను హత్య

పశ్చిమగోదావరి: వారిది ప్రేమ వివాహమే.. అయినా.. తరచూ గొడవలు. దీంతో విసిగెత్తిపోయిన భార్య ఏకంగా తన భర్త మర్మాంగాలు కోసిమరి హత్య చేసిన ఘటన జిల్లాలోని టి.నరసాపురం మండలం మక్కినవారిగూడేంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కఠారి అప్పారావు, లక్ష్మి భార్యాభర్తలు.

వీరు 15 ఏండ్ల కిత్రం ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు(14) కూడా ఉంది. భార్యాభర్తలిద్దరూ మద్యం సేవించేవారు. కాగా ఇటీవల వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విసిగిపోయిన భార్య తన భర్త మద్యం మత్తులో ఉండి నిద్రిస్తుండగా మర్మాంగాలు కోసి హత్య చేసింది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like