FbTelugu

వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ వెబ్ సైట్: కన్నబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రైతుల నుంచి వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తుల మార్కెటింగ్ కు వెబ్ సైట్ ను ప్రారంభించనున్నట్టు మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్లు నమోదు నమోదు చేసుకునే విధంగా వెబ్ సైట్ ను రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు.

కరోనా నేపథ్యంలో రైతులు తమ ధాన్యం అమ్మకాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. రైతుల మార్కెటింగ్ వ్యవస్థలకు ఆన్ లైన్ లో ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇప్పటికే స్విగ్గీ, జోమాటో ద్వారా పండ్లు, కూరగాయల విక్రయాలు జరుగుతున్నట్టు తెలిపారు. ఈ నెల 30న రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు.

You might also like