FbTelugu

లాకప్ డెత్… బాధితురాలి కుమారుడికి డిజిపి ఓదార్పు

ఖమ్మం: యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్ లాకప్ డెత్ లో చనిపోయిన మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ ను డిజిపి ఎం.మహేందర్ రెడ్డి పరామర్శించారు.
ఖమ్మం సంకల్ప హాస్పిటల్ కు వెళ్లిన మహేందర్ రెడ్డి బాధితుడు ఉదయ్ కిరణ్ తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడ్డగూడూరు పోలీసు స్టేషన్ లో ఎవరు ఫిర్యాదు చేశారు, మరియమ్మను ఎవరు తీసుకువెళ్లారు, ఎందుకు కొట్టారు, ఘటనకు కారణాలు ఏమిటనే వివరాలు సేకరించారు.

విచారణ సందర్భంగా ఎంతమంది పోలీసులు పాల్గొన్నారు, ఎంత మంది పోలీసులు కొట్టారు, వారిని గుర్తుపడతావా అని అడిగారు. తనకు, తన తల్లికి జరిగిన అవమానంపై ఉదయ్ కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు క్రిమినల్ కన్నా ఘోరంగా హింసించారని, పోలీసుల దెబ్బలకు తాళలేక తన తల్లి మరియమ్మ తన చేతుల్లోనే మరణించిందన్నారు. తనకు న్యాయం చేయాలని కోరగా, ఇప్పటికే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామని డిజిపి తెలిపారు.
బాధితుడిని కలిసిన తరువాత మీడియాతో మహేందర్ రెడ్డి మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. మొత్తం ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నామని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.