FbTelugu

మరాఠా రిజర్వేషన్లు కుదరదు: సుప్రీం సంచలన తీర్పు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో స్వరాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరేలా ఇచ్చిన మరాఠా రిజర్వేషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే స్పందించారు. మరాఠాలకు రిజర్వేషన్లను కల్పించే చట్టాన్ని రద్దు చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చట్టం చేసే అధికారం, ప్రధాని, రాష్ట్రపతికి మాత్రమే ఉందన్నారు. ఈ విషయంపై ప్రధానికి లేఖ రాసి, అభ్యర్థిస్తామన్నారు. దీనిపై తమ పోరాటం ఆపేది లేదని, రిజర్వేషన్లు సాధఇంచే వరకు చట్టబద్దమైన పోరాటం కొనసాగిస్తామని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.