FbTelugu

సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టుల దాడి

రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మరోసారి మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.

వివరాల్లోకెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిపిన దాడిలో పలువురు జవాన్లకు తీవ్ర గాయాలైనాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనతో అప్రమత్తమైన జవాన్లు మావోయిస్టులపై ఎదురు దాడికి దిగారు.

You might also like