FbTelugu

న్యూడెమోక్రసీ నాయకులు అరెస్టు

వరంగల్: న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ కమాండర్ సూర్యం, శ్యామ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లాలోని అనరవెల్లి- మేడపల్లి సరిహద్దులో ఇద్దరిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

గత అర్ధరాత్రి అనారోగ్యానికి గురైన సూర్యాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. కాగా వీరి అరెస్ట్ విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. వీరిని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని న్యూడెమోక్రసీ కార్యకర్తలు నర్సంపేట, మహబూబాబాద్ లో ధర్నా చేశారు.

You might also like