FbTelugu

మావోయిస్టు పోస్టర్లు కలకలం

విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల పోస్టర్లు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. నేటి నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారాన్ని విజవంతం చేయాలంటూ.. వాల్ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఏఓబీ(ఆంధ్ర ఓడిశా సరిహద్దు) లో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి.

మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే వీలున్నందున కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు. అడవుల్లో అణువణువూ గాలిస్తున్నారు.

You might also like