FbTelugu

పోరాడమంటే బిజెపి చంకన చేరాడు: మావోయిస్టు పార్టీ

హైదరాబాద్: తెలంగాణలో ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటం చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటిస్తునే తన ఆస్తుల రక్షణ కోసమే బిజెపి తీర్థం పుచ్చుకున్నాడని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది.

బిజెపి హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో విశాల ప్రజలు ఐక్యంగా పోరాడుతున్నారు. తెలంగాణ లో కెసిఆర్ నియంతృత్వ ధోరణి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతునే ఉన్నారు. ఈ సమయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ లో మళ్లీ గెలిచేందుకు తెలంగాణ ఆత్మగౌరవం పదం ఎత్తుకున్నాడు. టిఆర్ఎస్ లో ప్రధాన భూమిక పోషించిన ఈటల ప్రజల ఆత్మగౌరవాన్ని తొక్కేశాడు. ఆర్ఎస్ఎస్, ఆర్.ఎస్.యు శక్తులు కలిసి కెసిఆర్ కు వ్యతిరేకంగా పోరాడతాయని ఒకేగాటన కట్టడం దారుణం. దేశ చరిత్రలో ఆర్ఎస్ఎస్, ఆర్.ఎస్.యు లు ఎప్పుడూ బద్ద శత్రువులే. బిజెపి దళారీ నిరంకుశ పాలక వర్గాల్లో ఒక దూకు స్వభావం కలిగిన పార్టీ అని, అలాంటి ప్రతిఘాతుక పార్టీలో ఈటల చేరడం ప్రజలను మోసగించడమేనని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. ఆర్.ఎస్.యు, మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తున్నాయని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసం. బిజెపిలో చేరవద్దని, ప్రజాస్వామిక శక్తులతో కలిసి కెసిఆర్ కు వ్యతిరేకంగా పోరాడాలని పలుమార్లు సిన వినతులను ఈటల తోసిపుచ్చాడు. ఈటల రాజేందర్ అవకాశవాదాన్ని, కెసిఆర్ కుటుంబ పాలను ప్రజలు తిప్పికొట్టాలని జగన్ పిలుపునిచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.