బీజాపూర్: మా వద్ద బందీగా ఉన్న పోలీసును విడిచిపెట్టేందుకు, ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు సూచించాలని మావోయిస్టు సెంట్రల్ కమిటీ అధికార ప్రతినిధి విఠల్ లేఖను విడుదల చేశారు.
చత్తీస్ గఢ్ జిర్రగూడెం దాడిపై మావోయిస్టు సెంట్రల్ కమిటీ రెండు పేజీల లేఖ ను విడుదల చేసింది. జిర్రగూడెం దాడిలో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. మాపై దాడి చేసేందుకు రెండు వేల మంది పోలీసులు వచ్చారు. ఈ దాడికి ఐపీఎస్ అదికారి విజయ్ కుమార్ నేతృత్వంలో ఐదు రాష్ట్రాల పోలీసులు పథకం రచించారు. తమ ప్రతిదాడిలో 23 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. పాలకవర్గం తెచ్చిన యుద్దంలో పోలీసులు బలికావద్దు. పోలీసులు మాకు శత్రువులు కాదు. ఘటనలో చనిపోయిన పోలీసు కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఒక పోలీసు ఉద్యోగి బందీగా దొరికాడని, మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీగా ఉన్న పోలీసును సురక్షితంగా అప్పగిస్తాం. చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధమేనని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది.