FbTelugu

26న భారత్ బంద్‌: మావోయిస్టు పార్టీ

బీజాపూర్: ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మావోయిస్టు అధికార ప్రతినిధి పేరుతో రెండు పేజీల లేఖను విడుదల చేశారు.
ఛత్తీస్ గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మట్టుబెట్టి సత్తా నిరూపించుకున్న మావోయిస్టు పార్టీ ప్రభుత్వానికే సవాల్ విసిరారు.

ఈ ఘటన తరువాత పోలీసులే మావోయిస్టుల బలంపై పునరాలోచనలో పడ్డారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రజా ఉద్యమాల మాసంగా మావోయిస్టు పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ఆహ్వానించకుండా దొంగదెబ్బ తీయాలని చూస్తుందని ఆరోపించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.