FbTelugu

కరోనా తో మావోయిస్టు మృతి

మహబూబాబాద్: కరోనా వైరస్ మావోయిస్టు అగ్రనేతలను మింగేస్తున్నది. సరైన వైద్యం లభించక అటవీ ప్రాంతాల్లోనే ప్రాణాలు విడుస్తున్నారు. భద్రాద్రి జిల్లా కమిటీ సభ్యురాలు జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద కరోనాతో చనిపోయింది.

శారద కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తమకు సమాచారం ఉందని, కరోనాతో పోరాడుతూ చనిపోయిందని మహబూబాబాద్ జిల్లా ఎస్.పి కోటి రెడ్డి తెలిపారు. ఈ నెల 24న ఆమె చనిపోయినట్లు తెలిసిందన్నారు. మావోయిస్టు చర్ల, శబరి ఏరియా కమిటీ కార్యద్రశిగా పనిచేసిన శారద డిసిఎం గా పదోన్నతి పొందారు. ఇటీవలే మరణించిన మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ భార్య శారద. కొద్ది రోజుల వ్యవధిలో భార్యాభర్తలు కన్నుమూయడంతో కుటుంబం సభ్యుల వేదన భరించరాని విధంగా ఉంది. హరిభూషన్ మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించకుండానే అంత్యక్రియలు పూర్తి చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.