FbTelugu

భద్రతా దళాల కాల్పుల్లో మావోయిస్టు మృతి 

రాయ్ పూర్: భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెంది, ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలైన ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఇవాళ ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతాదళాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలైనాయి.

You might also like