FbTelugu

చత్తీస్ గఢ్ లో మావోల దుశ్చర్య

చత్తీస్ గఢ్: నారాయణపూర్ జిల్లా కడేనార్ సమీపంలో మావోయిస్టులు పేల్చిన మందుపాతరలకు ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని అంబూలెన్స్ లో తరలించి చికిత్స చేయిస్తున్నారు.
కడేనార్ సమీపంలో 25 మంది జవాన్లతో వెళ్తున్న డీఆర్జీ బస్సును మావోయిస్టులు పేల్చివేశారు. సంఘటానికి స్థలానికి వెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.