FbTelugu

లవ్ జీహాదీ చట్టం తెస్తున్నాం: కర్ణాటక బీజేపీ

బెంగళూరు: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరహాలో పలు రాష్ట్రాలు లవ్ జిహాదీ నిరోధించేందుకు చట్టాలను తెస్తున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో లవ్ జిహాదీ చట్టం ఆమోదిస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటిల్ తెలిపారు.

విజయపురలో బుధవారం బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నళిన్ కుమార్ కటిల్ మాట్లాడుతూ, ముస్లిం యువకులు హిందూ యువతులను పెళ్లి పేరుతో మోసం చేయకుండా ఉండేందుకు ఈ చట్టం తీసుకువస్తున్నామన్నారు. అయోధ్యలో రామజన్మభూమి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు చెందినదని స్వామీజీలు చెప్పలేదన్నారు. రాముడి జన్మస్థానం అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా, వివాదాస్పద స్థలం అని సీఎల్పీ నేత సిద్ధరామయ్యా వ్యాఖ్యానించడం తీర్పును అవమానించడమేనని ఆయన ఆరోపించారు. గతంలో డ్రగ్స్ సొమ్ముతో కాంగ్రెస్ ప్రభుత్వం నడిచేదని, ఇప్పుడు ఆ దందాలను యడియూరప్ప ప్రభుత్వం నిషేధించిందని కటిల్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.