FbTelugu

కమల్ పార్టీలో రాజీనామాల చిచ్చు

చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) లో రాజీనామాల చిచ్చు మొదలైంది. ఎన్నికలు ఫలితాలు వచ్చిన క్షణమే నాయకుల బేధాభిప్రాయాలు పొడసూపాయి.

పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ రాజీనామా సమర్పిస్తూ, కమల్ హాసన్ కు సుధీర్ఘ లేఖ రాశారు. అయితే మహేంద్రన్ వైఖరిపై కమల్ హాసన్ భగ్గుమన్నారు. ఆయన ద్రోహి అని, రాజీనామా చేయకపోయినా ఆయనున తొలగించేవారన్నారు. పిరికిపందల్లా పార్టీని వీడేవారి గురంచి ఆలోచించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో విభజించు పాలించి విధానం అమలవుతోంది, పార్టీ నడిపేతీరు సరిగ్గా లేదని మహేంద్రన్ లేఖలో ఆరోపించారు. మహేంద్రన్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు రాజీనామాలు సమర్పించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.