FbTelugu

ఒక వార్డుకు రిపోర్టర్ మనోజ్ పేరు…

హైదరాబాద్: రిపోర్టర్ మనోజ్ కుమార్ యాదవ్ స్మృత్యర్థం ఒక వార్డుకు మనోజ్ వార్డు అని పేరు పెట్టినట్లు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి సుపరింటెండెంట్ డా.రాజారావు ప్రకటించారు.

అయితే ఈ వార్డుకు ప్రత్యేకత ఉందని, కేవలం జర్నలిస్టులకు మాత్రమే వైద్యాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. టీవీ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేసిన మనోజ్ కరోనా సోకడంతో గాంధీలో చేరారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే మనోజ్ చనిపోయాడంటూ జర్నలిస్టు సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

వైద్యులు, సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ మనోజ్ చనిపోవడానికి ముందు తన మిత్రుడితో వాట్సప్ ఛాటింగ్ చేశాడు. ఆక్సీజన్ పెట్టడం లేదని, ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని మనోజ్ వేడుకున్నాడు. ఈలోపే ప్రాణాలు కోల్పోవడం, సోదరుడు కూడా వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే తన సోదరుడు చనిపోయాడని ఆరోపించాడు. ఈ ఆరోపణల నుంచి బయటపడేందుకు గాంధీ ఆసుపత్రి ఒక వార్డుకు మనోజ్ అని పేరు పెట్టింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.